Prabas: దర్శకుడు సింగీతంతో యంగ్ రెబల్ స్టార్
Prabas: రెబల్ స్టార్ ప్రభాస్ తీరిక లేకుండా వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆదిపురుష్, సాలార్ తో పాటు పాన్ ఇండియా ప్రాజెక్ట్-K షూటింగ్ లో ఉన్నాడు. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచంలోని టాప్ సినీ టెక్నిషన్స్ ని రంగంలోకి దించుతున్నారట. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు మారుతీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ‘సింగీతం శ్రీనివాస’ దర్శనమిచ్చాడు. సింగీతంతో కలిసి ప్రభాస్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే గతంలో సింగీతం శ్రీనివాస దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ వంటి టైమ్ ట్రావెల్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు ఈ సెట్ లో కనిపించడం చర్చకు దారి తీస్తుంది. సినిమా విషయంలో నాగ అశ్విన్, సింగీతం సలహాలు తీసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీపికా పడుకోణె ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నాడు.