RRR: ‘ఆర్ఆర్ఆర్’పై పోర్న్ స్టార్ ఆసక్తికరమైన ట్వీట్!
Porn Star Kendra Lust Tweet on RRR Movie: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, హాలీవుడ్ ముద్దుగుమ్మ ఓలివియా మోరీస్, శ్రియాశరణ్, అజయ్‌దేవ్‌గణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. అల్లూరిగా రామ్‌చరణ్, భీమ్‌గా ఎన్టీఆర్ ఆయా పాత్రల్లో ఒదిగిపోగా.. రాజమౌళి తెరకెక్కించిన విధానం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.తాజాగా ఈ చిత్రంపై మరొకరు ప్రశంసలు కురిపించారు.
ఈ మూవీని పోర్న్ స్టార్ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన పోర్న్ స్టార్ కేండ్రా లస్ట్ ట్విట్టర్ ద్వారా కొనియాడింది. ”నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, డైలాగ్ డెలీవరీ, పాటలు, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. వారిద్దరి నటన ‘ఆర్ఆర్ఆర్’కు ఆత్మలాంటింది” అని ట్వీట్ చేసింది కేండ్రా లస్ట్.
Watched RRR on @netflix & was completely blown away ! Wow @AlwaysRamCharan & @tarak9999 What a movie..Acting..songs.. cinematography..stunts.. dialogue delivery..everything perfect..! ❤️
Both actors are handsome & their acting is the soul of the movie #RRR#RamCharan𓃵 #NTR𓃵 pic.twitter.com/eR4bWLIwSd— Kendra Lust™ (@KendraLust) July 10, 2022