జగపతిబాబు(Jagapathi Babu) బార్బీ లుక్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. ఫ్యాన్స్ నుంచి దానికి విపరీతమైన స్పందన వచ్చింది. దీంతో ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు జగ్గూ భాయ్.
Poonam Kaur : ఒకప్పుడు హీరోగా కంటే ఇప్పుడు విలన్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు సీనియర్ హీరో జగపతి బాబు(Jagapathi Babu). సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఫ్యాన్స్‌కు ఫోటోలు షేర్ చేస్తూ.. తన అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేయడంలో జగ్గూ భాయ్ అందరి కంటే ముందే ఉంటారు.
రీసెంట్గా జగపతిబాబు(Jagapathi Babu) బార్బీ లుక్ లో కొన్ని ఫోటోలను షేర్ చేయగా.. ఫ్యాన్స్ నుంచి దానికి విపరీతమైన స్పందన వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకూ జగపతి షేర్ చేసిన ఫోటోలన్నింటి కంటే ఎక్కువగా ఆ బార్బీ లుక్కుకే క్రేజ్ వచ్చింది. దీంతో ఫ్యాన్స్‌కు థాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు జగ్గూ భాయ్.బార్బీ పింకీకి హయ్యస్ట్ వ్యూస్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు.
జగపతి బాబు చేసిన ట్వీట్‌పై టాలీవుడ్ హీరోయిన్..నిత్యం వివాదాలతో వార్తల కెక్కే పూనమ్ కౌర్(Poonam Kaur) స్పందింది. అయితే పవన్ కళ్యాణ్ అంటే అంతెత్తున లేచే పూనమ్.. జగ్గూ భాయ్‌ను ఆకాశానికెత్తేసింది. ‘జగ్స్ ఏంటి ఈ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడం అందరికీ.. మంచిది కాదు అంటూ ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. దీంతో ఈ రెండు ట్వీట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Jags enti ee tough competition ivvadam andariki – manchidi kadu 😎
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 16, 2023