Poonam Kaur: నాపై పంజాబీ ముద్ర వేయకండి..పూనమ్ కౌర్
poonam-kaur: తెలుగు తెరపై పరిచయం అక్కరలేని పేరు పూనమ్ కౌర్..తాజాగా పూనమ్ కౌర్ కంటతడి పెట్టుకున్నారు. సోమవారం రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా పూనమ్ మాట్లాడుతూ.. నేను మీ అందరిలానే తెలంగాణ బిడ్డని. మళ్లీ చెబుతున్నా.. దయచేసి మైనారిటీ అని, సిక్కు అని.. నన్ను వేరు చేసి చూడవద్దని వేడుకుంటున్నా అంటూ.. వేదికపైనే ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.
తెలంగాణ రాజ్ భవన్ లో ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు గవర్నర్ తమిళి సై. పలు రంగాల్లో ప్రతిభ కనబరచిన మహిళలకు పురస్కారాలు అందచేశారు. ఈ సందర్బంగా పూనమ్ కౌర్ ఈ వ్యాఖ్యలు చేసారు. అలాగే ఇటీవల మృతి చెందిన మెడికో స్టూడెంట్ ప్రీతి ని తలచుకుని కూడా ఆమె భావోద్వేగానికి లోనైనారు. ఈమధ్య సినిమాలకు దూరమైన పూనమ్ సోషల్ మీడియా కే పరిమితమైంది. ఆమధ్య రాహుల్ గాంధీ జోడోయాత్రలో పాల్గొంది పూనమ్.
రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు, వివిధ రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు ఈ సందర్భంగా పురస్కారాలు అందించారు.