Satish Kushik death: సతీష్ కౌశిక్ మృతిపై పలు అనుమానాలు, పోలీసులకు లభ్యమైన మందులు
Police recovered Medicines from Farm House where satish Kaushik attended party
బాలీవుడ్ నటుడు దర్శకుడు సతీష్ కౌశిక్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులకు దొరికిన కొన్ని ఆధారాలు పలు అనుమానాలకు కలిగిస్తున్నారు. సతీష్ కౌశిక్ హోలీ వేడుకల్లో పాల్గొన్న ఫాంహౌస్ తనిఖీ చేసిన పోలీసులకు అక్కడ కొన్ని మందులు లభ్యం అయ్యాయి. ఓ పారిశ్రామిక వేత్తకు చెందిన ఈ ఫాంహౌస్ హోలీ వేడుకలకు కేరాఫ్ అడ్రస్ అయింది. అక్కడే అనేక మంది సినీ ప్రముఖులు వచ్చి సందడి చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
హోలీ వేడుకలకు ముందు, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎవరెవరకు వేడుకల్లో పాల్గొన్నారు. అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫాంహౌస్ లో దొరికిన మందులను పరిశీలనకు పంపారు. ఆ మందులు వాడడం వల్ల ఎటువంటి ప్రభావం కలగనుందనే విషయాలను ఆరా తీస్తున్నారు.
సతీశ్ కౌశిక్ మృతి
ఢిల్లీలో జరిగిన హోలీ వేడుకల్లో సతీశ్ కౌశిక్ పాల్గొన్నారు. హోలీ వేడుకలు ముగిసిన కొన్నిగంటలకు సతీశ్ కౌశిక్ కొంత ఇబ్బందికి గురయ్యారు. వెంటనే డ్రైవర్ ను అప్రమత్తం చేశారు. కారులో ఆసుపత్రికి బయలుదేరారు. ఆసుపత్రికి వెళుతున్న క్రమంలోనే గుండెపోటుకు గురయ్యారు.