BRO Movie: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తొలి సారి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన భారీ ఫాంటసీ థ్రిల్లర్ `బ్రో`. విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.
BRO Movie: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తొలి సారి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన భారీ ఫాంటసీ థ్రిల్లర్ `బ్రో`. విలక్షణ నటుడు సముద్రఖని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌లుగా నటించారు. నిత్యం బిజీ లైఫ్‌కు అలవాటుపడి కుటుంబాన్ని పట్టించుకోని ఓ యువకుడు ప్రమాదంలో మరణిస్తే..అలాంటి వ్యక్తికి మళ్లీ బ్రతికే ఛాన్స్ వస్తే ఏం జరిగింది? తన జీవితాన్ని మళ్లీ చక్కదిద్దుకున్నాడా?..దీనికి టైమ్ దేవుడు ఏం చేశాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాని రూపొందించారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `గోపాల గోపాల` తరువాత మరో సారి దేవుడిగా కనిపించిన సినిమా ఇది. భారీ అంచనాల మధ్య జూలై 28న విడుదలైన ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఫరవాలేదు అనే టాక్‌ని సొంతం చేసుకుంది. వెండితెరపై పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ మామా అల్లుళ్లు అదరగొట్టారని మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది.
ఇందులో థర్టీ ఇయర్స్ పృథ్వీ పోషించిన శ్యాంబాబు క్యారెక్టర్‌పై వివాదం మొదలవ్వడం, ఈ క్యారెక్టర్‌ని నన్ను కించపరచాలనే ప్రత్యేకంగా త్రివిక్రమ్‌తో పవన్ రాయించాడని ఏపీ అధికార పార్టీ నేత అంబటి రాంబాబు విమర్శలు చేయడంతో `బ్రో` మూవీ మరింత వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబట్టిన ఈ సినిమా నెల తిరక్కుండానే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమింగ్ జరగడం అభిమానుల్ని షాక్‌కు గురి చేసింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా `బ్రో` దూకుడు చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
`బ్రో` సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే ఆగస్టు 25 నుంచి ఈ సినిమాని ఐదు భాషల్లో స్ట్రీమింగ్ మొదలు పెట్టింది. ముందు ఇంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. ప్రస్తుతం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న `బ్రో` నెట్ ఫ్లిక్స్ ఇండియా లిస్ట్‌లో టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. దీంతో మెగా అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.