ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను సరికొత్తగా 4k లో చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. ఇక ఆ సినిమాలను కూడా కొత్త సినిమాలు రిలీజ్ చేసినట్లు హంగామా చేసి హైప్ తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను సరికొత్తగా 4k లో చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు మేకర్స్. ఇక ఆ సినిమాలను కూడా కొత్త సినిమాలు రిలీజ్ చేసినట్లు హంగామా చేసి హైప్ తీసుకొస్తున్నారు. కాగా .. రీ రిలీజ్ సినిమాలు కూడా రిలీజ్ అయిన రోజు.. కోట్ల కలక్షన్స్ రాబట్టి రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు చాలావరకు రీ రిలీజ్ అయ్యి రికార్డులు కొల్లగొట్టాయి. ఆరెంజ్, ఖుషీ, జల్సా, సింహాద్రి, ఆది, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ లిస్ట్ లో చేరింది పవన్ కళ్యాణ్ మరో సినిమా తొలిప్రేమ. పవన్ ను మాస్ హీరోగా నిలబెట్టింది బద్రి అయితే.. ఒక లవర్ బాయ్ గా నిలబెట్టిన సినిమా తొలిప్రేమ. పవన్ కెరీర్ లోనే ఎవరు గ్రీన్ లవ్ స్టోరీగా తొలిప్రేమ అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమాను జూన్ 30 న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తీ కానున్న సందర్భంలో తొలిప్రేమ రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించింది. ఎస్.ఎస్.వి ఆర్ట్స్ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ హిట్ గా నిలిచింది. దేవా అందించిన సంగీతం.. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట తొలిప్రేమ సాంగ్స్ వినిపించేలా చేస్తుంది. నీ మనసే, ఏమి సోదరా మనసుకు ఏమైందిరా, గగనానికి ఉదయం ఒకటే లాంటి సాంగ్స్ ఇప్పటికీ చార్ట్ బస్టర్స్ గా ఉన్నాయి. ఈ సినిమా కేవలం లవ్ స్టోరీనే కాదు.. అన్నాచెల్లెళ్ళ మధ్య ఉన్న అనుబంధం, ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కన్నా.. ఆమె కెరీర్ ముఖ్యమని చెప్పే గొప్ప ప్రేమకథ. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూన్ 30 న థియేటర్ లో తొలిప్రేమ అనుభవాలను చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.