Pawan Kalyan:దర్శక, నిర్మాతలను పరుగులు పెట్టిస్తున్న పవర్ స్టార్
Pavan Kalyan Not available after Dusara Festivel:వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నాడు.ఒకవైపు రాజకీయం మరోవైపు సినిమా ఈ రెండు బ్యాలెన్సుడ్ గా చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ‘భీమ్లా నాయక్’ సినిమాతో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరీలో 4 సినిమాలు ఉన్నాయ్.
ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ ముందుకు కదలడం లేదు. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ గతేడాది క్రితమే మొదలైంది. ఏఎం రత్నం నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.కానీ ఎప్పుడో విడుదల కావాల్సిన ఏ చిత్రం గురించి ఏమి అప్ డేట్స్ బయటకు రావడం లేదు.
ఈ మధ్యనే మరో రీమేక్ ని పట్టాలెక్కించబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో సముద్రఖని నటించి తెరకెకకించిన ‘వినోదాయ సితం’ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ నటిస్తుండగా హీరో పాత్రలో సాయి ధరమ్ తేజ్ కనిపించే అవకాశం వుందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు . ఈ మధ్య జరిగిన సభలో తాజాగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దసరా పండుగ నుంచి రోడ్లపైనే ఉంటానని ప్రజల అందుబాటులో ఉంటూ ఊరూరా తిరుగుతానని చెప్పాడు.ఈవిషయం తెలుసుకున్న దర్శకులు ,నిర్మాతల గుండెల్లో పిడుగు పడ్డట్టయింది.ఒకవైపు షూటింగ్ మధ్యలో ఉన్నాయ్.ఇప్పుడు ఈ ప్రకటన తో మేకర్స్ పవన్ వద్దకి పరుగులు పెడుతున్నారట.
ఇప్పుడున్న ఈ షెడ్యూల్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ని స్టార్ట్ చేసి విడుదల చేయడం కుదరని పని. దీన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాలంటే ఎలక్షన్స్ తర్వాతే అని అంటున్నారు. మరి ఎప్పుడో ప్రారంభించిన హరి హర వీరమల్లు సినిమా ఈ దసరాకైనా వస్తుందో లేదంటే 2024 వరకు వెయిట్ చేయాల్సి వస్తుందో చూడాలి మరి.