Pawan Kalyan: హరి హర వీరమల్లు నుండి క్రేజీ అప్ డేట్
Pawan Kalyan: బీమ్లానాయక్ తో సూపర్ హిట్ అందుకున్న పవన్ కళ్యాణ్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి సిద్దమవుతున్నాడు. పవన్ సినిమా వస్తోందంటే చాలు ఫాన్స్ కు పూనకాలే.. తాజాగా పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి ‘హరిహర వీరమల్లు’ సినిమా ద్వారా పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం పవన్ చాలానే కష్టపడుతున్నాడు. పీరియాడిక్ సినిమా కావడంతో యాక్షన్ ఎపిసోడ్స్ చాలానే ఉంటాయిఅందుకు తగ్గట్టుగానే పవన్ కూడా ఫుల్ ఫోకస్ తో యాక్షన్ ఎపిసోడ్లను పూర్తి చేసాడని సమాచారం.
క్రిష్ దర్శకత్వంలో సూర్యా మూవీస్ బ్యానర్ పై ఎ.ఎమ్. రత్నం నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది. గత ఏడాది కిందట పవన్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసారు. విడుదలైన కొద్దీ గంటల్లోనే ట్రేండింగ్ స్థాయిలో కి చేరుకుంది. పవన్ సినీ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతుంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా నుంచి బిగ్ అప్ డేట్ వచ్చింది.
జనవరి 26న టీజర్ విడుదల చేస్తామంటూ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇంకా దీనిపై క్లారిటీ రావాలి. పీరియాడిక్ సినిమా కావడంతో రిపబ్లిక్ డే సందర్బంగా పవన్ కళ్యాణ్ సినిమానుండి టీజర్ విడుదల కావచ్చు అని ఫాన్స్ అభిప్రాయం పడుతున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.