Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోస్ కు పవన్ కళ్యాణ్ క్షమాపణ
Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చ సుదీప్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాడు. వివరాల్లోకి వెళితే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు కలిసి నటిస్తున్న భారీ చిత్రం కబ్జా. ఈ చిత్ర ఆడియో వేడుకలను భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు మేకర్స్. సినిమాల్లో రాజకీయాల్లో బిజీ ఉండడంవల్ల తెలుగులో కూడా చాలా ఫంక్షన్స్ కు వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సినిమాకు చీఫ్ గెస్ట్ గా పవన్ ను ఆహ్వానించారు సమయం లేనందున రాలేకపోతున్నానని సుదీప్ ,ఉపేంద్రలకు క్షమాపణలు చెప్పాడు పవన్ కళ్యాణ్.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ‘కబ్జ సినిమా హీరోస్ ఉపేంద్ర, సుదీప్ లకు నా హృదయపూర్వక అభినందనలు. కబ్జా చిత్రంలో ఉపేంద్ర, సుదీప్ ఇద్దరూ విభిన్నమైన పాత్రలలో నటించారు. ఈ సినిమా కన్నడతోపాటు అన్ని భాషల్లోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు ఈ చిత్రబృందానికి కృతజ్ఞతలు. పొలిటికల్ మీటింగ్స్ ఉండడం వల్ల మీ వేడుకకు రాలేకపోతున్నందుకు చింతిస్తున్నాను అని పవన్ తెలిపారు.
ఇక కబ్జ మూవీలో శ్రియాశరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ముఖ్య పాత్రల్లో పోసాని కృష్ణ మురళీ, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు. ఇక కబ్జ సినిమాను చంద్రు డైరెక్ట్ చేస్తూ.. స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.