Pawan Kalyan: చిరుకు యాక్షన్ సీన్ చెపుతున్న పవన్
Pawan Kalyan: అన్నయ్య చిరంజీవికి ఫైట్ మాస్టర్ గా మారాడు పవన్. ఓ సినిమాలో చిరంజీవి కోసం పవర్ స్టార్ ఫైట్స్ కంపోజ్ చేశారు. ఓ అరుదైన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది.చిరంజీవి తనంతట తానుగా నటుడిగా ఎదిగి టాలీవుడ్‌లో మెగాస్టార్‌గా ఎదిగారు. చిరు వారసుల్లో పవన్ కళ్యాణ్ ఒకరని చెప్పొచ్చు. అన్న అడుగుజాడల్లో ఎదిగి హీరోగా ఎదిగి ఇప్పుడు పవర్‌స్టార్‌గా తన ఇమేజ్‌తో ఇండస్ట్రీని శాసించే స్థాయికి ఎదిగాడు పవన్.
డ్యాన్స్‌లో మెగాస్టార్ చిరంజీవిని మించిన వారు లేరు. ఇప్పుడు బన్నీ, చరణ్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు చిరునే ఇంస్ప్రెషన్ గా తీసుకుంటారు. యాక్షన్ పరంగా చిరంజీవికి మంచి గుర్తింపు ఉంది. యాక్షన్ సినిమాలతోనే స్టార్ అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్‌లు అందుకున్నాడు. ఓ సినిమాకు చిరంజీవి తమ్ముడు పవన్ ఫైట్స్ కంపోజ్ చేశాడు. పవన్ తన సినిమాల్లో ఫైట్స్ కంపోజ్ చేస్తుంటాడు. అలాగే అన్నయ సినిమాలో కూడ ఫైట్ సీన్స్ కంపోజ్ చేసాడు. అన్నయ్యకు ఫైట్ మాస్టర్ గా మారడం ఆసక్తిని కలిగిస్తుంది.
నటుడిగా చిరంజీవికి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాల్లో ‘డాడీ’ ఒకటి. కూతురి సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఇందులో మంచి పోరాట సన్నివేశాలు ఉన్నాయి. అవి పవన్ కంపోజ్ చేయడం విశేషం. తాజాగా ఆ విషయం బయటకు వచ్చింది. ఓ ఫోటో వైరల్ అవుతుంది. ‘డాడీ’ సినిమాలో చిరంజీవి కోసం పవన్ ఫైట్స్ కంపోజ్ చేస్తూ కనిపించాడు. మరో విశేషం ఏంటంటే..పవన్ ఈ ఫొటోలో గుండుతో కనిపిస్తున్నాడు.