Pathaan: బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేసిన పఠాన్
Pathaan: నాలుగేళ్ల గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం రిపబ్లిక్ డే కానుకగా విడుదలై కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. గత రెండేళ్లుగా సరైన హిట్టు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ కు షారుక్ ఉపిరినిచ్చాడు. విడుదలైన తొలి రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తుంది పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొనె కథానాయికగా నటించగా.. సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేశారు.
వరుస వివాదాలు చుట్టుముట్టిన ఈ సినిమా పరాజయంపాలవుతుందేమో అనుకున్న సందర్భంలో.. ఈ యాక్షన్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా విడుదలై మొదటిరోజునుండే భారీ వసూళ్లను రాబడుతుంది. హిందీ వర్షన్‌లో రూ.529.7 కోట్ల కలెక్షన్లు సాధించగా.. ప్రపంచ వ్యాప్తంగా రూ.1027 కోట్లతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని సృష్టించింది. ఇన్నాళ్లు బాహుబలి-2 పేరిట ఉన్న ఈ రికార్డును పఠాన్ బ్రేక్ చేసింది. పోటీగా షెహజాదా, సెల్ఫీ వంటి సినిమాలున్నా ‘పఠాన్’ భారీ కలెక్షన్‌లతో దూసుకపోతుందంటే విశేషం అనే చెప్పాలి. సెల్ఫీ, షెహజాదా కూడా పెద్దగా ప్రభావం చూపకపోవడంతో పఠాన్ సినిమాకు వసూళ్లు బాగా వస్తున్నాయి. బాహుబలి2 , దంగల్, కేజీఎఫ్2,ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ‘పఠాన్’ నిలిచింది.