PVT04: తలలు కోసి చేతికిస్తా నాయాలా.. ఊర మాస్ లుక్ లో మెగా మేనల్లుడు
Panja Vaisshnav Tej Doing Mass Role For The First Time: ఉప్పెన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఫస్ట్ సినిమా తోనే 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న ఏకైక ఇండియన్ సినిమా హీరోగా పేరు తెచ్చుకున్న వైష్ణవ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టి దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈ యంగ్ హీరో నటించిన రంగ రంగ వైభవంగా రిలీజ్ కు రెడీ అవుతుండగా మరో సినిమాను పట్టాలెక్కించేసాడు. మొట్టమొదటి సారి మెగా మేనల్లుడు ఊర మాస్ లుక్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ లో కనిపించనున్నాడు.
హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఓ మూవీలో వైష్ణవ్ తేజ్ సరసన పెళ్లి సందD’ ఫేమ్ శ్రీలీల నటిస్తోంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ల పై సూర్యదేవర నాగవంశీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా PVT04 డైలాగ్ మోషన్ పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
“రేయ్ రాముడు లంకమీద పడటం వినుంటాయ్ అదే పది తలకాయలున్నోడు ఇంటిమీద పడితే ఎట్టుంటాదో సూస్తావా?.. అని విలన్స్ సవాల్ చేస్తుంటే.. ఈ అయోధ్యలో వుండేడిది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్రకాళేశ్వరుడు.. తలలు కోసి సేతికిత్తా నాయాలా.. సూసుకుందాం రా..’ అంటూ ప్రతి సవాల్ విసిరి హీరో హైప్ పెంచేశాడు. ఇక చివర్లో వైష్ణవ్ ఊర మాస్ లుక్ అదరగొట్టేసింది. యాసను బట్టి చూస్తుంటే ఈ కథ అంతా రాయలసీమ నేపథ్యంలో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది . మరి ఈ సినిమాతో మెగా మేనల్లుడు మాస్ ఇమేజ్ ను అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.