Pallavi Joshi Injured : నటి పల్లవి జోషికి తీవ్ర గాయాలు?
Pallavi Joshi Injured : సెన్సేషనల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్’ సెట్స్‌లో నటి పల్లవి జోషి గాయపడ్డారు. ఆమెను షూట్ లో అదుపుతప్పిన ఒక వాహనం ఢీకొట్టిందని తెలుస్తోంది. ఇక చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెబుతున్న దాని ప్రకారం, పల్లవి గాయపడినప్పటికీ షూటింగ్ కొనసాగించింది. “గాయపడినప్పటికీ, పల్లవి షూట్‌ను కొనసాగించింది. ఆమె ఇప్పుడు చికిత్స కోసం ఆసుపత్రికి వెళుతోంది” అని అభిషేక్ అగర్వాల్ వెల్లడించారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తర్వాత వివేక్ అగ్నిహోత్రి – నటి పల్లవి జోషి కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ఈ ‘ది వ్యాక్సిన్ వార్’. అభిషేక్ అగర్వాల్‌తో కలిసి పల్లవి జోషి తన ‘ఐ యామ్ బుద్ధ’ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నారు. తాజాగా, ‘కాంతార’ స్టార్ సప్తమి గౌడ ‘ది వ్యాక్సిన్ వార్’ షూట్ లో జాయిన్ అయినట్టు ప్రకటించారు. ఇక ఆమె షూట్ లో చేరిన రెండో రోజే పల్లవికి యాక్సిడెంట్ కావడం గమనార్హం. ‘ది కాశ్మీర్ ఫైల్స్’లో ఉన్న అనుపమ్ ఖేర్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ‘ది వ్యాక్సిన్ వార్’ భారతీయ శాస్త్రవేత్తలు రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి రెండేళ్లుగా పడిన కష్టం, అప్పటి పరిస్థితులు బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం 2023 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 11 భాషల్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.