Paathan: ‘బేషరమ్’ సాంగ్ లో క్లోజప్ షాట్స్ కట్
Paathan: ఈమధ్య ప్రతిసినిమాలో ఎదో ఒక రగడ నడుస్తుంది. ఆ మధ్య ఓ సినిమాలో ఓపాటమీద రచ్చ రచ్చ నడిచింది. కొందరి మనోబావాలుదెబ్బతిన్నాయంటూ కోర్టులదాకా వెళ్లాయి. ఆ తర్వాత పాటలోని లిరిక్స్ మార్చేవరకు పట్టు పట్టికుర్చున్నారు. చేసేదేముంది లిరిక్స్ మార్చి సినిమాను విడుదలచేసుకున్నారు. ఇప్పుడు కూడా షారుక్ ‘పఠాన్’ సినిమాకూడా అంతే..అయితే ఇందులో లిరిక్స్ కాదు ఏకంగా పాటనే తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేసాయి. ‘పఠాన్’ మూవీలోని ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయినరోజునుండి హిందూ సంఘాలు,అలాగే ముస్లిం సంఘాలు భగ్గుమన్నాయి. ఈ సాంగ్ లో దీపిక పదుకొనె అంగాంగ ప్రదర్శన, అందాల ఆరబోతపై నెటిజన్లు, రాజకీయ పార్టీలు రోడ్డెక్కాయి. ఈ సాంగ్ ను తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళలనలు,నిరసనలు చేసారు.
సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాను విడుదల కానివ్వబోమంటూ పలువురు నాయకులు హెచ్చరించారు. పనిలో పనిగా సెన్సార్ బోర్డుపైనా విరుచుకుపడ్డారు. తాజాగా ఈ సినిమాను సెన్సార్ బోర్డు వీక్షించింది. సినిమా చూసిన సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే, పలు కట్స్ సూచించింది. ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక స్విమ్ సూట్‌లో ఉన్న మూడు క్లోజప్ షాట్స్‌తోపాటు కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌ను తొలగించాలని ఆదేశించింది. సినిమాకు మొత్తంగా 10కిపైగా కట్స్ సూచించింది. దీంతో సినిమా విడుదల సమయానికి మార్పులు చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇక రన్ టైం వచ్చేసి 2.26. నిమిషాలుగా తేల్చింది. ఈ నెల 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.