OTT vs Theatre:సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్` నుంచి మరో పెద్ద సినిమా థియేటర్లలో సందడి చేయలేదు. ఆగస్టు చివరి వారంలో వరుణ్ తేజ్ `గాండీవధారి అర్జున` అంటూ థియేటర్లలోకి వచ్చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల వంతు మొదలు కాబోతోంది.
OTT vs Theatre:సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్` నుంచి మరో పెద్ద సినిమా థియేటర్లలో సందడి చేయలేదు. ఆగస్టు చివరి వారంలో వరుణ్ తేజ్ `గాండీవధారి అర్జున` అంటూ థియేటర్లలోకి వచ్చేసినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ నెల వంతు మొదలు కాబోతోంది. ప్రారంభమే `ఖుషీ`తో మొదలు కాబోతోంది. ఈ వారం `ఖుషీ` మినహా చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాదే హవా ఉండబోతోంది. దీనితో పాటు పెద్దగా స్టార్ కాస్ట్ లేని సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నారు. వీటితో పాటు ఇదే వారం ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలోనూ సినిమాలు, సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. అవేంటీ? ..వాటి కథా కమామీషూ ఏంటీ అన్నది ఒక లుక్కేద్దాం.
రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ…
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ `ఖుషీ`. సమంత హీరోయిన్గా నటించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో నిర్మించారు. పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్ 1న శుక్రవారం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహెబ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుని సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. `లైగర్` డిజాస్టర్ తరువాత విజయ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న `ఖుషీ` రౌడీ స్టార్ కు మళ్లీ ఖుషీని తెచ్చి పెడుతుందా? అన్నది తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.
సరికొత్త ప్రేమకథతో..
ఆముద శ్రీనివాస్ కథానాయకుడిగా నటించి తెరకెక్కించిన ప్రేమ కథా చిత్రం `నా..నీ ప్రేమకథ`. కారుణ్య చౌదరి కథానాయికగా నటించింది. షఫీ, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రవణ్ కుమార్ నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథగా ఈ సినిమాని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఓ గ్రామంలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కథ, కథనాలు కొత్తగా ఉంటాయని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని చిత్ర బృదం తెలిపింది.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది వీల్ ఆఫ్ టైమ్
సోనీలివ్
స్కామ్ 2003 (హిందీ, తెలుగు సిరీస్) సెప్టెంబర్ 1
జీ 5
డీడీ రిటర్న్స్ (తమిళ్, తెలుగు) సెప్టెంబర్ 1
నెట్ ఫ్లిక్స్
ఎలోన్ (రియాలిటీ షో) ఆగస్టు 30
చూజ్ లవ్ (హాలీవుడ్) ఆగస్టు 31
వన్ పీస్ (వెబ్ సిరీస్) ఆగస్టు 31
ఫ్రైడే నైట్ ప్లాన్ (హిందీ) సెప్టెంబర్ 1
హ్యాపీ ఎండింగ్ (హాలీవుడ్) సెప్టెంబర్ 1
వీటితో పాటు ఇప్పటికే ఆగస్టు 25న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో బ్రో, బేబీ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూ ఓటీటీ ప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. ఆహా ఓటీటీలో బేబీ సినిమా టాప్‌లో నిలవగా, నెట్ ఫ్లిక్స్ ఇండియాలో పవన్ `బ్రో` మూవీ టాప్ 1లో ట్రెండ్ అవుతూ రికార్డు స్థాయి వీవర్ షిప్‌తో ఆకట్టుకుంటోంది.