O.T.T Suggestions for K.T.R: మంత్రి గారూ, మా సినిమా చూడండి సర్
గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్, ఓటీటీ లో చూసేందుకు తనకు మంచి సినిమాలను సూచించమని కోరారు. దీంతో అనేక మంది వ్యక్తులు,కొన్ని సంస్థలు తమ తమ సినిమాలను, వెబ్ సిరీస్‌లను సూచిస్తున్నాయి.
పరంపరను చూడండి కేటీఆర్
మంత్రి కేటీఆర్ కోరిక మేరకు పలు సంస్థలు కూడా తమ సినిమాలను సూచిస్తున్నాయి. బెస్ట్ రివెంజ్ డ్రామా పరంపర వెబె సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోందని మీరు చూసి ఎంజాయ్ చేయండని డిస్నీ సంస్థ సూచించింది.
Hello @KTRTRS, you should definately Binge the Best Telugu Revenge Drama #ParamparaOnHotstar Streaming Now 👇https://t.co/Kw5BXaq2vu
🌟ing@IamJagguBhai @naveenc212 @aakanksha_s30 @yoursishan @NainaGtweets @MuralimohanMP @shobu_ @arkamediaworks https://t.co/azRNlOaq4k
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) July 23, 2022
డీజే టిల్లు చూడమని డాక్టర్లు సూచించారు
ఆహా సంస్థ కూడా మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు స్పందించింది. జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. గాయం నుంచి త్వరగా కోలుకోడానికి పూర్తిస్థాయి కామెడి సినిమా డీజే టిల్లు చూడాలని డాక్టర్లు సూచించారని ఆహా ట్వీట్ చేసింది. మిస్ అవ్వకుండా చూడాల్సిన మరికొన్ని షోలు అంటూ నటసింహ బాలకృష్ణ అన్‌స్టాపబుల్, అమలాపాల్ నటించిన కుడి ఎడమైతే సినిమాను, ప్రియమణి నటించిన భామాకలాపం సినిమాలను ఆహా సంస్థ సూచించింది.
Wishing you a very happy birthday and doctors recommend #DJTillu for a speedy recovery full of laughter!
Some un-missables:
– #NBK's Unstoppable
– @Amala_ams's Kudi Yedamaithe-for some time loop thrills and – #Priyamani's investigative drama #Bhaamakalapam. https://t.co/byBnlKZ8df— ahavideoin (@ahavideoIN) July 24, 2022
గాడ్సే చూడండి కేటీఆర్
గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న మంత్రి కేటీఆర్‌కు దర్శకుడు గోపీ గణేశ్, తాను తెరకెక్కించిన గాడ్సే సినిమాను చూడమని సలహా ఇచ్చాడు. నెట్ఫిక్స్ ఓటీటీలో తాను దర్శకత్వం వహించిన గాడ్సే సినిమాను చూడమని కోరాడు. యువత కోసమే ఈ సినిమా తీశానని మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నానని గోపీ గణేశ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత మీరిచ్చే రివ్యూ కోసం ఎదురుచూస్తుంటా అని ట్వీట్ ముగించాడు.