Oscar awards2023: ఆస్కార్ వేడుక టైమింగ్ ఎప్పుడంటే..?
Oscar awards2023: ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూసే ఆస్కార్ వేడుక మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకలు అంగరంగా వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే 95వ ఆస్కార్ అకాడమీ వేడుకల సందడి మొదలైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో చిత్రాలు ఈ అవార్డ్స్ అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. అందులో మన తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా పోటీపడుతున్న సంగతి తెలిసిందే.
భారత కాలమానం ప్రకారం ఈనెల 13 ఉదయం 5.30 గంటల నుంచి ఆస్కార్ వేడుక ప్రారంభం కానుంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు వేడుక ప్రారంభమవుతుంది. మన దేశంలో మాత్రం సోమవారం 13వ తేదీ ఉదయం 5.30 గంటలకు ఐ ఎస్ టి లో ప్రత్యేక్ష ప్రసారంలో చూడవచ్చు. ఈసారి బరిలో తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట తుది నామినేషన్లలో నిలవడంతో భారతీయులకు ‘ ఆసక్తి ఎక్కువైంది. గత ఏడాది అంటే 2022 ఆస్కార్ అవార్డు వేడుకకు రెజీనా హాల్, యామీ స్కూమర్, వాండా స్కైక్స్ లు హోస్ట్ లుగా వ్యవహరించారు. ఈసారి మాత్రం సింగిల్ హోస్ట్ గా ఉండబోతుందని సమాచారం. ప్రముఖ కమెడియన్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ గా వ్యవహరించనున్నారని కీలకసమాచారం అందుతుంది.