Oscar Award Sale: ఆస్కార్ అవార్డునూ అమ్మేశారు తెలుసా?
Oscar Award Sale: సినీ పరిశ్రమకు చెందినవారు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు పొందడం తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటుంటారు. కానీ, ఆ ఆస్కార్ అవార్డు కొంతమంది అమ్మేశారు. అవును నిజమే, ‘సిటిజన్ కేన్’ సినిమాకు ఆర్సన్ వెల్లెస్ కు ఆస్కార్ రాగా.. ఆర్థిక పరిస్థితుల కారణంగా అతని కుమార్తె బీట్రైస్ వెల్లెస్ ఆస్కార్ను అమ్మేశారు. ఆస్కార్ అమ్మేందుకు కఠినమైన నియమాలున్నా.. ఇప్పటివరకూ 150 ఆస్కార్లు అమ్ముడయ్యాయని అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 1950కి ముందు దాకా అవార్డు గెలుచుకున్న వాళ్ళకే ట్రోఫీపై అన్ని హక్కులు ఉండేవి. ఆ తర్వాత అకాడమీ తన రూల్స్ సవరించి విజేతలు ఎవరైనా సరే ఆస్కార్ ట్రోఫీని.. వేరే వాళ్లకు అమ్మడానికి వీల్లేదని, ఒకవేళ అమ్మాలంటే.. అకాడమీకే అమ్మాలని ముందుగానే కాంట్రాక్ట్ మీద విజేతలతో సైన్ చేయించుకుంటారు. అలా అమ్మగా ఒక్కటంటే ఒక్క డాలర్ మాత్రమే ఇస్తారు. అయితే ఒప్పందాన్ని కాదని వేరేవాళ్లకు అమ్మితే.. కోర్టుకు వెళ్తుంది అకాడమీ. అయినప్పటికీ 50 ఆస్కార్లు అమ్ముడయ్యాయి.