Oscar Awards 2023: ఆస్కార్ బరిలో నిలిచేదెవరు..?
Oscar Awards 2023: ఆస్కార్ అవార్డులకు సంబంధించి బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్‌తో పాటు బెస్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన షార్ట్ లిస్ట్ జాబితాను నేడు సాయంత్రం ప్రకటించనున్నారు. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ కు ఏ విభాగాల్లో చోటు దక్కవచ్చన్నది సినీ వర్గాల్లో, సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది జరుగనున్న 95వ ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్స్ ని నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఇప్పటికే పలు దేశాల సినిమాలు ఈ లిస్ట్ లో దరఖాస్తు చేసుకోగా ఇండియా నుండి ఆస్కార్ బరిలో ది లాస్ట్ ఫిలిం షో, ఆర్ఆర్ఆర్, కాంతార వంటివి పలు క్యాటగిరిల్లో నామినేషన్స్ లిస్ట్ లో నిలుస్తాయా? లేదా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
కాలిఫోర్నియాలోని బ్లేవరిహిల్స్ వేదికగా ఈ ఆస్కార్ షార్ట్ లిస్ట్ కార్యక్రమం జరుగనుంది. యాక్టర్ కేటగిరీలో ఎన్టీఆర్, రామ్‌చరణ్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో రాజమౌళి పేర్లు షార్ట్ లిస్ట్ అవుతాయా లేదా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు కన్నడ సినిమా కాంతర కూడా ఈ ఆస్కార్ బరిలో నిలిచిందని వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ రెండు సినిమాలదే హవా నడిచింది. ‘ఆర్ఆర్ఆర్’ సహా ఇండియా నుంచి కాంతార, ది కాశ్మీర్ ఫైల్స్, విక్రాంత్ రోణ, గంగూబాయి ఖతియావాడీ, ఇరైవిన్ నిజాల్‌తో పాటు మరికొన్ని సినిమాలను ఆస్కార్ అవార్డుల కోసం ఇండివిజువల్ గా అప్లై చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రభంజనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక అవార్డులను , రివార్డులను దక్కించుకుంది. ఈ మద్యే ‘గోల్డెన్ గ్లోబ్’ మరియు ‘లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్’ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డ్స్ ని అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ అవార్డ్స్ ని కూడా అందుకుంటుందని కూడా అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ రోజు జరుగబోయే నామినేషన్ షార్ట్ లిస్టులో ఏ సినిమా ఏ ఏ క్యాటగిరి నామినేషన్స్ లో చోటు అందుకుంటుందో తెలియాలి అంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.