Mani Ratnam: 300 మంది డ్యాన్సర్లతో ‘పొన్నియన్ సెల్వన్’ పాట చిత్రీకరణ
Ponniyin Selvan took 300 dancers: దర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ పీరియాడిక్ డ్రామాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష ,కార్తీ ప్రధాన తారాగణం గా తెరకెక్కుతుంది.
500 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ పార్ట్ టీజర్ ను విడుదల చేసింది యూనిట్. ఈ టీజర్ సినిమాపై మరింత బజ్ ను పెంచింది. టీజర్ చూస్తుంటేనే కచ్చితంగా నాన్ బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టేలా తలపించింది.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. అదేంటంటే ఈ మూవీలో ఒక సాంగ్ కోసం ఏకంగా 300 మంది డాన్సర్లను తీసుకొచ్చారట. వీరిలో 100 మంది స్పెషల్ డ్యాన్సర్లు కాగా వారందరూ ముంబైకి చెందిన వారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ ముగిసిందని… దీని షూట్ పూర్తి చేయడానికి మూవీ యూనిట్కి దాదాపు 25 రోజులు పట్టిందని సమాచారం.
దీన్ని బట్టి చూస్తుంటే ఈ పాటను ఎంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారో అర్ధమవుతోంది. ఈ సింగిల్ పాట కోసమే రూ.కొన్ని కోట్లు వెచ్చించినట్లు అర్థమవుతోంది. రెండు పార్టుల మొత్తానికి ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు యూనిట్. సెప్టెంబర్ 30 న మొదటి భాగం విడుదల కానుంది.