Balakrishna Unstoppable season 2 :బాబాయ్ షోకు గెస్ట్ గా రానున్న అబ్బాయ్?
Balakrishna Un stoppable season 2: నందమూరి నటసింహం వెండితెరపైనే కాదు బుల్లి తెరపై కూడా తన స్టైల్ వేరు అనిపించాడు.వేదిక ఏదయినా అక్కడ బాలయ్య ఉంటే అది అన్‌స్టాపబుల్. మొదటి సారి బాలయ్య ఈ షో కి హోస్ట్ గా చేస్తున్నాడంటే ఫాన్స్ ఆనందానికి పట్టపగ్గాలేవ్ ఆ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించిన ఈ షో తొలి సీజన్‌ను విజయంతంగా పూర్తి చేశాడు . తన షోకు వచ్చిన అతిథులందరితో కలిసిపోతూ సరదా సరదా గా మాట్లాడుతూ మధ్య మధ్యలో చమత్కరిస్తూ మాట్లాడుతూ సందడి చేశాడు.
బాలయ్య సందడితో సీజన్1 పూర్తయింది. అయితే అన్‌స్టాపబుల్ సీజన్2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా సీజన్2పై అప్‌డేట్ ఇచ్చేసింది. ఆగస్టు 15 నుంచి టాక్ షోను ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా రన్ చేసిన బాలయ్య రెట్టింపు ఉత్సహంతో ఉన్నాడు. ఈ షో కి సంబందించిన వర్క్స్ చకచకా జరుగుతున్నాయి.
బాలయ్య షోకు గెస్ట్స్ గా ఎవరు రాబోతున్నారనే అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. మొదటి షోకు మెగా స్టార్ చిరంజీవి అతిథిగా వస్తున్నారని తెలుస్తోంది. అలాగే వెంకటేశ్, నాగార్జున, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షోకు వస్తున్నారని టాక్ ఇదిలా ఉంటే గెస్ట్ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు కూడా కూడా వినిపిస్తోంది. ఇది వాస్తవమే అయితే ఒకే స్టేజ్ పై బాబాయ్- అబ్బాయి ఎం మాట్లాడుకుంటారో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తూన్నారు.
మీలో ఎవరు కోటీశ్వరుడు తో బుల్లితెరలో రియాలిటీ షోగా మంచి విజయం అందుకుంది. దాంతో ఈ షో నాలుగు సీజన్లు విజయవంతంగా నడిచాయి.చివరి సీజన్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేసాడు.ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్ కలయిక ఎలాఉండబోతుందనేది చర్చ నడుస్తుంది.