Das Ka Dhamki Pre Release: నేను ఆ టైమ్ లో విశ్వక్ సినిమానే చూస్తాను..ఎన్టీఆర్
Das Ka Dhamki Pre Release: విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. తాజాగా విశ్వక్ హీరోగా నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా మార్చి 22న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ఈమద్యే నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్ సేన్ నటనతో పాటు ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ రావడంపై మొదటిసారి స్పందించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..విశ్వక్ మాట్లాడినట్లు నేనెప్పటికీ మాట్లాడలేను. సినిమాలమీద సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన టైమింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఎక్కడికైనా వెళితే సాధారణంగా నేనే ఎక్కువగా మాట్లాడతానని అనుకుంటే నాకంటే విశ్వక్ ఎక్కువగా మాట్లాడతాడు. నా మూడ్ బాగోకపోతే నేను చూసే సినిమాల్లో విశ్వక్ నటించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా తప్పక ఉంటుంది. అందులో విశ్వక్ అద్భుతంగా నటించాడు. అలాగే ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ రావడంలో భారతీయ చిత్ర పరిశ్రమ, తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షక దేవుళ్ల దీవెనలే కారణమన్నారు. ఈ పురస్కారం ప్రేక్షకులకు చెందుతుంది
ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న విడుదల చేసేందుకు చిత్రబృంద సన్నాహాలు చేస్తోంది. విశ్వక్‌సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. వన్యమే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవిశేషం ఏంటంటే ఈ చిత్రానికి విశ్వక్ దర్శకుడు కావడం మరో విశేషం.