పలువరు నేతలు, తారలు తరలివస్తోన్న ఈ కార్యక్రమంపై అన్నగారి అభిమానులు ఆసక్తి పెంచుకున్నారు
NTR SHATA JAYANTI SABHA : ఎన్టీఆర్ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఇవాళ కూకట్పల్లి కేపీహెచ్‌బీలోని కైతలాపూర్ గార్డెన్స్‌లో భారీ ఈవెంట్ జరగనుంది. కాగా ఈ వేడుకలకు దాదాపు 15,000 నుంచి 20,000 మంది అభిమానులు హాజరవుతారని సమాచారం. కూకట్‌పల్లిలోని కైతలాపూర్ స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుంచి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు కానున్న దృష్ట్యా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ కూకట్ పల్లిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ వేడుకలను https://mycityhyderabad.in వెబ్ సైట్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ప్రత్యక్ష ప్రసారాల కోసం లైవ్ చూడండి.