RRR: రాజమౌళి బాగా టార్చర్ చేసాడు.. ఎన్టీఆర్
RRR: రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఎంత సక్సెస్ సాధించిందో అందరికి తెలిసిందే. దాదాపుగా 1200 కోట్లు కొల్లగొట్టింది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ను సైతం కైవసం చేసుకుంది. ఈ సందర్బంగా ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ని ప్రశంసలతో ముంచెత్తారు దర్శకుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఒక కంటి నొసతో యాక్టింగ్ చేయగలరని పొగిడారు. కాగా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరగనుంది. ఈ ఇంటర్నేషనల్ సినిమా వేడుకలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర టీమ్ పాల్గొననున్నారు. దీని కోసం ఇప్పటికే అక్కడకు చేరుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ టీం ను హాలీవుడ్ మీడియా యంగ్ టైగర్ ఎన్టీఆర్ , దర్శకుడు రాజమౌళిలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. వీటికి సంధానం చెప్తూ నాటు నాటు సాంగ్ కోసం రాజమౌళి 65 రాత్రులు టార్చర్ చేశారని చెప్పారు ఎన్టీఆర్. నాటు నాటు సాంగ్ ని 12 రోజులు షూట్ చేశాం. పర్ఫెక్షన్ కోసం రాజమౌళి విపరీతంగా ప్రాక్టీస్ చేయించారు. ఈ సాంగ్ పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డామని ఎన్టీఆర్ వెల్లడించారు. అయన టార్చర్ చెర్రీ ని నన్ను మరింతగా బాధించిన కూడా చివరకు అవుట్ ఫుట్ చూసాక ఈ సినిమా కోసం పడ్డ కష్టమంతా మరచిపోయామని అని చెప్పాడు. ఈ వేదికపై రాజమౌళి.. హీరోలని పొగడ్తలతో ముంచెత్తాడు. కొమరం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ నటన నా చిత్రాలలో ఆల్ టైం ఫేవరేట్ అని చెప్పాడు. ఇంత వరకు నేను అంత మంచి సన్నివేశాలు డైరెక్ట్ చేయలేదు. టాలెంటెడ్ హీరోస్ అంటూ రాజమౌళి ఆకాశానికి ఎత్తాడు.