NTR: ఒకే వేదికపై అన్నదమ్ములు
NTR as chief guest for Bimbisara Pre Release Event: నందమూరి కళ్యాణ్ రామ్ గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న సోసియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. కేథరిన్ థెరిసా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించనున్నారు. తన కెరియర్ లో ఎప్పుడు చేయని పాత్రలో ‘బింబిసార’లోచేసారు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే ఇది అత్యంత హైయెస్ట్ భారీ బడ్జెట్ సినిమా గా రాబోతుంది.
‘బింబిసార’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 29వ తారీఖున నిర్వహించనున్నారు మేకర్స్.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో ‘బింబిసార’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వస్తున్నట్లు … ‘జై లవకుశ’ సినిమాలో కొన్ని సీన్స్ మరియు ‘బింబిసార’లో కొన్ని సీన్స్ కలిపి టీజర్ వీడియో విడుదల చేయడం జరిగింది.చింతరామన్ భట్ ఈ చిత్రానికి పాటలు అందించగా.. ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ నటించారు.