Side actor: రాంచరణ్, ఎన్టీయార్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్, ఇంతకీ ఏం జరిగిందంటే..
NTR fans angry on the Side actor comment
హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. తన హీరో ఎన్టీఆర్ కు అవమానం జరుగుతోందని ఎన్టీఆర్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హీరో రాంచరణ్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తూ అనేక ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చింది. రాంచరణ్ ని ఇంటర్వ్యూ చేసిన యాంకర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ సైడ్ యాక్టర్ అని అన్నట్లు ఉన్న ఓ వీడియో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడ్డారు.
ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అన్న విషయం జోరుగా ప్రచారం కావడంతో మరికొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆ వీడియోను పరిశీలించారు. అది ఎడిటెడ్ వీడియో అని గ్రహించారు. పూర్తి వీడియోను విడుదల చేశారు. అందులో యాంకర్ along side, actor NTR అని ప్రస్తావించింది. ఎన్టీఆర్ సైడ్ యాక్టర్ అని అనలేదు. ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన ఈ మాటల పూర్తి వీడియోను మరికొందరు షేర్ చేశారు. అపోహలను దూరం చేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ శాంతించారు.
ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కలెక్షన్లు కొట్టగొట్టడంతో పాటు ప్రేక్షకులను హృదయాలను కూడా కొల్లగొట్టింది. నాటు నాటు సాంగ్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. అవార్డు రావాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రాంచరణ్ అమెరికాలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చ జరిగేలా అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.