ఆర్ఆర్ఆర్ సక్సెస్.. ఎమోషనల్ అయిన ఎన్టీఆర్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన ట్రిపుల్ ఆర్.. బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మూడు రోజుల్లోనే ఈ సినిమా 500 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. అన్ని భాషల్లోను ట్రిపుల్ ఆర్ మూవీకి విశేష ఆదరణ దక్కుతోంది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చెయ్యగా ఇరు హీరోలపై కూడా ప్రశంసలు జల్లు కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్‌గా ఓ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు.. అందులో చిత్ర యూనిట్ తో పాటు అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
లెజెండరీ యాక్టర్ అజయ్ సర్ తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నానని.. ఈ అనుభవాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటానని అన్నారు. ఆలియా పవర్ హౌస్ అని.. ఒలివియా మోరీస్ తన నటనతో హృదయాల్లో నిలిచిపోయిందన్నారు. ఇక నిర్మాత డీవీవీ దానయ్య గురించి చెబుతూ.. యు ఆర్ రాక్.. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని నిర్మించినందుకు ధన్యవాదాలు అన్నారు. అలాగే ట్రిపుల్ ఆర్ మూవీకి తన సంగీతంతో లైఫ్ ఇచ్చినందుకు కీరవాణి గారికి సిన్సియర్ థాంక్స్ చెప్పారు. ఇక విజయేంద్ర ప్రసాద్ భారతీయ సినిమాల్లో అత్యుత్తమ కథలని అందిస్తున్నారని.. ఆయన కథలు ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ లవర్స్ హృదయాలని గెలుచుకుంటోంది అంటూ.. ప్రతీ ఒక్కరినీ పేరు పేరునా ఎన్టీఆర్ గుర్తు చేసుకున్న తీరు ఆకట్టుకుంటోంది. ఏదిఏమైనా రామ్ చరణ్, రామారావ్, రాజమౌళి.. ఈ ముగ్గురు లేనిదే ఆర్ఆర్ఆర్ లేదు అనేది నమ్మదగ్గ నిజమే..