NTR RS 100 Coin:వెండితెర వేల్పుగా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన నటుడు,జన హృదయ నేత, తెలుగు దేశం పార్ఠీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సావాలు ఇటీవల అత్యంత వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయం తెలిసిందే.
NTR RS 100 Coin:వెండితెర వేల్పుగా కోట్లాది మంది హృదయాల్లో నిలిచిన నటుడు,జన హృదయ నేత, తెలుగు దేశం పార్ఠీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సావాలు ఇటీవల అత్యంత వైభవంగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నందమూరి తారక రామారావు స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణేన్ని ముద్రించింది. సోమవారం ఈ నాణేన్ని ఉదయం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
Ntr Commemorative Coin Release..junior Ntr Not Visible At Event
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రపతి భవన్‌లోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ వర్గాలు, అతిథులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా దాదాపుగా 200 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పాల్గొంటారని, బాబాయ్ బాలయ్య, మామ నారా చంద్రబాబు నాయుడులతో కలిసి వేదికపై మెరుస్తారని వార్తలు వినిపించాయి. నిజానికి ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సింది. కానీ ఆయన అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు.
ఎన్టీఆర్ మనవడిగా తారక్‌కు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందినా `దేవర` షూటింగ్ కారణంగా హీరో ఎన్టీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల నందమూరి ఫ్యామిలీలో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ పెళ్లిలో ఎన్టీఆర్ తమ్ముడు మోక్షజ్ఞ, అన్న కల్యాణ్ రామ్ తో కలిసి కనిపించడం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ స్మారక నాణెం ఆవిష్కరణ కార్యక్రమంలో తారక్ పాల్గొంటారని అంతా భావించారు. కానీ `దేవర` కారణంగా హాజరు కాలేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.
కుటుంబం అన్నగారి కుటుంబం..
Anna Gari Kutumbam
ఎన్టీఆర్ సస్మారక నాణెం ఆవిష్కరణ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో సోమవారం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నాణేంని అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అన్నగారి కుటుంబం హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ కుమార్తె, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చాలా వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
NTR #NandamuriTarakaRamarao ₹100 Coin officially launched by the President of India at Rashtrapati Bhavan, Delhi in the presence of family members 🔥🔥
JOHAR NTR JOHAR NTR 🙏
— Meg 'NTR' (@meghanath9999) August 28, 2023