Ram Skanda:ఉస్తాద్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా `స్కంద`. ఊర మాసీవ్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌లుగా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
Ram Skanda:ఉస్తాద్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా `స్కంద`. ఊర మాసీవ్ యాక్షన్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌లుగా నటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అంశాలతో పాటు హై వోల్టేజ్ యాక్షన్ ఘట్టాల నేపథ్యంలో పుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించారు. సెప్టెంబర్ 19న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
హీరో రామ్ `ఇస్మార్ట్ శంకర్` తరువాత మరో సారి పక్కా తెలంగాణ యువకుడిగా, తెలంగాణ యాసతో నటించిన సినిమా ఇది. అయితే రీసెంట్‌గా విడుదల చేసిన ట్రైలర్‌లోని కొన్ని సన్ని వేశాల్లో తెలంగాణ యువకుడిగా, మరి కొన్ని సీన్‌లలో ఆంధ్రా అబ్బాయిగా కనిపించిన తీరు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజన్‌కు గురి చేస్తోంది. సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లు ఉన్నారు కాబట్టి రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా? ..లేక ఒక్కడే ఇద్దరిగా కనిపిస్తూ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరో 19 రోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు ఓవర్సీస్ కష్టాలు వెంటాడుతున్నాయి.
కారణం దర్శకుడు బోయపాటి శ్రీను. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్‌లలోనూ బోయపాటి శ్రీను సినిమాకు భారీ స్థాయిలో ప్రేక్షకులున్నారు. కానీ ఓవర్సీస్‌లో మాత్రం ఆయన సినిమాకు పెద్దగా సందడి ఉండదు. ప్రీమియర్ షోలు కూడా ఉండవు. మొదటి నుంచి బోయపాటి సినిమా అంటే ఓవర్సీస్‌లో పెద్దగా మార్కెట్ లేదు. ఇతర దర్శకుల సినిమాఅంటే ఎగబడే డిస్ట్రిబ్యూటర్లు బోయపాటి సినిమా అనే సరికి ముఖం చాటేస్తారు. కనీసం మిలియన్ డాలర్‌ల రేట్ ని కూడా ఇవ్వడానికి ఇష్టపడరు.
ఇదే ఇప్పుడు రామ్ `స్కంద`కు ఇబ్బందికరంగా మారింది. పేరున్న హీరో వస్తోందంటే ఓవర్సీస్ ప్రీమియర్స్ కామన్..కానీ బోయపాటి సినిమాకు మాత్రం ఎక్కడా ప్రీమియర్స్ ఉండవు. `స్కంద` విషయంలోనూ అదే జరుగుతోంది. ఇదిలా ఉంటే ఓవర్సీస్‌లో బోయపాటి సినిమాలకు క్రేజ్ లేదని తెలిసి కూడా వచ్చిన ఆఫర్‌ని నిర్మాత వదులుకోవడమే తాజా పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. బయ్యర్స్ ఇచ్చిన ఆఫర్‌కు మించి కావాలని నిర్మాత పట్టుబట్టడంతో ఇప్పుడు అక్కడ `స్కంద` కోసం ఎవరూ ముందుకు రావడంలేదట. ఈ నేపథ్యంలో `స్కంద` ఓవర్సీస్ రిలీజ్‌పై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.