Anjali: సస్పెన్స్ తో కూడిన అంజలి ‘ఇరట్ట’ ట్రైలర్
Anjali: జోజు జార్జి నటించిన ‘ఇరట్ట’ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే జోజు జార్జి రెండు విభిన్నమైన పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. వినోద్ , ప్రమోద్ అనే రెండు రోల్స్ లో జోజు జార్జి నటించారు. ఈ సినిమా ద్వారా ఎమ్.కె. కృష్ణన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు హీరోయిన్ అంజలి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పు పాతు పప్పు మరియు సిజో వడకన్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటే ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి స్టేట్ నేషనల్ అవార్డ లు సొంతం చేసుకున్న జోజు ఈ సినిమాలో మరో విభిన్నమైన పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు.
జోజు మరియు అంజలితో పాటుగా శ్రీన్ద, ఆర్య సలీం, శ్రీకాంత్ మురళి, సబుమోన్ మరియు అభిరామ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు జాక్స్ బెజొయ్ సంగీతం అందిస్తున్నారు. అన్వర్ అలీ సాహిత్యం అందిస్తున్నారు. అలాగే మను అంథోని ఎడిటర్ గా , దిలీప్ నాథ్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 2011లో జయసూర్య నటించిన పయ్యన్స్‌తో మలయాళంలో అడుగుపెట్టిన అంజలి చివరిసారిగా 2018 ‘రోసాపూ’ లో కనిపించింది. ఆ తరువాత మలయాళంలోకి మళ్ళీ ప్రవేశించింది.