Nikhil Siddhartha: కార్తికేయ 2 విడుదల పై కొనసాగుతున్న సందిగ్ధత
Karthikeya 2 Release Confusion Continues: హీరో నిఖిల్ కెరీర్లో చాల చిత్రాలు వచ్చిన అందులో కార్తికేయ చిత్రానికి ప్రత్యేకమైన స్థానముంటుంది. 2014లో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ-2 రాబోతుంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటికే ఓ సారి విడుదల వాయిదా పడగా.. జులై 22న ఖరారు చేసింది యూనిట్. ఇప్పుడు మరోసారి రిలీజ్ వాయిదా పడింది. ఎందుకంటే ఇదే రోజు నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీంతో నిఖిల్ వెనకడుగు వేసాడు.
ఈ సినిమాకు విడుదలతేదీ తలనొప్పి గా మారింది. ఎందుకంటే ఆగస్టు 5 లేదా ఆగస్టు 12 తేదీలు ఈ చిత్ర విడుదలకు అందుబాటులో ఉండగా. ఈ రెండు తేదీలూ ఇప్పటికే పెద్ద సినిమాలతో లాక్ అయ్యాయి. ఆగస్టు 5న కల్యాణ్ రామ్ బింబిసార, దుల్కర్ సల్మాన్ సీతా రామం చిత్రాలు విడుదలవుతున్నాయి. కాబట్టి ఆగస్టు 5న కార్తికేయ-2 విడుదల చేయాలంటే ఈ సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది.
ఇక ఆగస్టు 11 అమిర్ ఖాన్ ‘నటించిన లాల్ సింగ్ చద్దా’ విడుదలవుతుంది.ఈ చిత్రాన్ని మెగాస్టార్ తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.ఇక ఆగస్టు 12 నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల అవుతుంది . నితిన్‌తో పోటీ వద్దులే అనుకుంటే నిఖిల్ ఆగస్టు మూడో వారం వరకు వేచి ఉండాల్సిందే. మరి విడుదల తేదీ పై చిత్రబృందం అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మంగళవారం నాడు కార్తికేయ-2 హిందీ, తమిళ టీజర్లను విడుదల చేసిన మేకర్స్ కానీ విడుదలపై స్పష్టత ఇవ్వలేదు.