18 Pages: ఓటీటీలోకి నిఖిల్ 18 పేజెస్
18 Pages: కార్తికేయ-2 లాంటి సూపర్ హిట్ తర్వాత గతేడాది నిఖిల్ నటించిన రెండో సినిమాగా వచ్చిన చిత్రం’18 పేజెస్’ ఇందులో కూడా ‘కార్తికేయ-2 ‘ జంటే రిపీట్ కావడం విశేషం. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్తాన్ని తెరకెక్కించాడు. డిసెంబర్ 23న ప్రేక్షకులముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఒకే సంవత్సరంలో నిఖిల్, అనుపమ సాలిడ్ హిట్ ను అందుకున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీలోవిడుదలవడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పుడు ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీవాసు నిర్మించారు. చిన్న సినిమాలను ప్రోత్సహించడంలో గీతా ఆర్ట్స్ 2 ఎప్పుడు సిద్దంగానే ఉంటుంది. ఈ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ’18 పేజెస్’ జనవరి 27 నుంచి ‘ఆహా’ లో ప్రదర్శితం కానుంది. థియేటర్లలో సక్సెస్ సాధించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి విజయాన్నందుకోనుందో వేచిచూడాలి.