Balakrishna:టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కెరీర్‌లని మలుపు తిప్పి వారి సినీ జర్నీలో మర్చిపోలేని ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచిన క్రేజీ బ్లాక్ బస్టర్లని వారి అభిమానులు, ఆసక్తిగల నిర్మాతలు రీ రిలీజ్‌లు చేస్తూ 4కె ప్రింట్‌లతో అభిమానుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే.
Balakrishna:టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల కెరీర్‌లని మలుపు తిప్పి వారి సినీ జర్నీలో మర్చిపోలేని ట్రెండ్ సెట్టర్స్‌గా నిలిచిన క్రేజీ బ్లాక్ బస్టర్లని వారి అభిమానులు, ఆసక్తిగల నిర్మాతలు రీ రిలీజ్‌లు చేస్తూ 4కె ప్రింట్‌లతో అభిమానుల్ని అలరిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఇండస్ట్రీ హిట్ `పోకిరి` రీ రిలీజ్‌తో టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ మొదలైంది. కొన్ని సినిమాల విషయంలో ఇది భారీ లాభాల్ని అందిస్తుంటే మరి కొన్ని సినిమాల విషయంలో నష్టాలని తెచ్చి పెడుతోంది.
అయినా సరే ఈ ట్రెండ్‌గా కొంత మంది నిర్మాతలు డబ్బులు సంపాదించడానికి అనువుగా వాడుకుంటూ స్టార్ హీరోల కెరీర్‌లని మలుపు తిప్పిన సినిమాలని 4కెలోకి రీ మాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్నారు. దేశ విదేశాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అలా విడుదల చేసిన సినిమాలు ఇటీవల భారీ వసూళ్లని రాబట్టాయి. మహేష్ `పోకిరి`, బిజినెస్‌మేన్, పవన్ కల్యాణ్ జల్సా, ఖుషీ వంటి సినిమాలు భారీ రీ రిలీజ్‌లోనూ లాభాల్ని అందించి రికార్డు సృష్టించాయి.
ఇదే కోవలో నందమూరి బాలకృష్ణ నటించిన క్రేజీ సినిమాలు కూడా 4కెలో రీ రిలీజ్ అవుతున్నాయి. అందులో కొన్ని మంచి వసూళ్లని రాబడితే మరి కొన్ని తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ నెల 30న నందమూరి బాలకృష్ణ నటించిన ఎవర్ గ్రీన్ జానపద చిత్రం `భైరవద్వీపం` రీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాని 4కె లోకి రీ మాస్టర్ చేసిన మేకర్స్ ముందు ఆగస్టు 5న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే అనివార్త కారణాల వల్ల ఆ రోజు రిలీజ్‌ని వాయిదా వేయాల్సి వచ్చింది.
తాజాగా ఆగస్టు 30న ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్‌తో పాటు 4కె రీరిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేశారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో చందమమా విజయా కంబైన్స్ బ్యానర్‌పై బి.వెంకటరామిరెడ్డి నిర్మించారు. రోజా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 1994, ఏప్రిల్ 14న విడుదలై బాలయ్య సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. మాధవపెడ్డి సురేష్ సంగీతం అందించిన ఈ సినిమా నంది పురస్కారాల్లో 9 నందులని సొంతం చేసుకోవడం విశేషం.