Raam Pothineni: రామ్ ని మందు పార్టీకి ఆహ్వానించిన బేబమ్మ!
Raam Pothineni The Warrior New Promo:ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ను కృతి శెట్టి మందేద్దాం రమ్మంది. అయితే రియల్‌గా కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్, కృతి శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’. లింగు స్వామి దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించాడు.
ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటించగా.. నదియా, అక్షర గౌడ కీలక పాత్రలను పోషించారు. జూలై 14న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం మంచి స్పందనను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇందులో రామ్ డాక్టర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గానూ అదరగొట్టేశాడు.ఎప్పుడు చేయని పాత్ర రామ్ చేయడం తో ఈ సినిమాను రామ్ అభిమానులే కాక సినీ ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.
అలాగే విజిల్ మహాలక్ష్మిగా రేడియో జాకీ పాత్రలో కృతి శెట్టి సైతం బాగానే అలరించింది.ఈ సినిమాలో కృతి కూడా మాస్ టచ్ ఉన్నపాత్రలో అక్కడక్కడ కనిపించింది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ సినిమాకు సంబంధించి ఓ ప్రోమో వీడియోను బటయకు వదిలారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇంతకీ వీడియో లో ఏముందంటే.. కృతి బయటకు వెళ్దామా అని అడుగగా.. దానికి రామ్ నవ్వుతూ ‘ఎక్కడికి కాఫీ షాప్కేనా’ అంటాడు. అంతలో కృతిశెట్టి ‘మందేద్దామా’ అనడంతో రామ్ షాక్ అవుతాడు. చివర్లో `ఓసి దీని దుంప తెగ` అంటూ నదియా డైలాగ్ వదలడం ఆకట్టుకుంది. మొత్తానికి పది సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Satya & Whistle Mahalakshmi's Onscreen Magical Chemistry is Pure Bliss 🤩❤️
🎟️https://t.co/dyBF2uJuVF
🎟️https://t.co/gt9CFtPDzo#WarriorrRampage #TheWarriorr ❤️🔥@ramsayz @AadhiOfficial @dirlingusamy @ThisisDSP @IamKrithiShetty @SS_Screens @adityamusic @masterpieceoffl pic.twitter.com/EPof96Bv62— Srinivasaa Silver Screen (@SS_Screens) July 17, 2022