Tollywood:తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడి గా బసిరెడ్డి
New President of Telugu Film Chamber: తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఈరోజు జరిగాయి. నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికయ్యారు అందుకుసంబందించిన విషయాన్నీ మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పై గెలుపొందాడు బసిరెడ్డి
మొత్తం 48 మంది ఈ సి మొంబర్స్ ఓటు హక్కు ఉండగా.. 42 మంది ఈ సీ సభ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు మిగతా ఆరుగురు ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.ఈ 42 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ పై గెలుపొందారు బసిరెడ్డి.
చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణ దాస్ దాస్ నారంగ్ ఏప్రిల్ 19న కన్నుమూశారు. దాంతో ఏప్రిల్ 27న ఫిలిం ఛాంబర్ కార్యవర్గం సమావేశమై ఛాంబర్ నియమ నిబంధనలను అనుసరించి కొల్లి రామకృష్ణను నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.అప్పటినుండి నేటివరకు ఈయనే అధ్యక్షుడిగా ఉన్నారు.