మలయాళీ కుట్టి.. మొదటి సినిమాకే డబ్బింగ్ చెప్పిందంట
న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా నజీమ్ ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం “అంటే సుందరానికీ”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా టీజర్ నేడు రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం విదితమే. ఇక టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మీడియాను ఉద్దేశించి మలయాళీ బ్యూటీ నజ్రియా ఫహద్ మాట్లాడుతూ, తాను ట్యూటర్ సహాయంతో తెలుగు నేర్చుకుంటున్నానని మరియు మలయాళంతో పాటు తెలుగులో కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పానని పేర్కొంది. తనకు చాలా తెలుగు ఆఫర్స్ వచ్చాయని, కానీ ఈ సినిమా కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు తెలిపింది. తనకు ఈ సినిమా చాలా ప్రత్యేకమని తెలిపిన నజ్రియా తెలుగు ప్రేక్షకులు ఎంతో మంచివారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ చిత్రం మలయాళీ కుట్టి హిట్ అందుకొని సెటిల్ అయిపోతుందా..? లేదా అనేది చూడాలి.