Oscar2023 Best Song Natu Natu: ఆస్కార్ అందుకున్న నాటు నాటు
Oscar2023 Best Song Natu Natu: ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకుంది. దక్షిణాది నుంచి తొలి ఆస్కార్ అందుకున్న చిత్రంగా రికార్డు సృష్టించింది. మొదటినుండి వేదికపై నాటు నాటు పాట మోత పుట్టిస్తోంది. వేడుక ప్రారంభంలోనే యాంకర్లు ముందుగా ఈ పాటకు వేదిక పైన డాన్స్ చేసారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్తో అదరగొట్టారు. హాలీవుడ్ డ్యాన్సర్స్ వెస్టర్స్ డాన్స్ తో మెప్పించారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు.
సినిమా యూనిట్ నుంచి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్ లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్తో అందరిలోనూ జోష్ ను నింపారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అయిదు పాటలు నామినేట్ అవ్వగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వరించింది. దీంతో ఒక్కసారిగా నాటు నాటు అంటూ డాల్బీ థియేటర్ మార్మోగిపోయింది.
నాటు నాటు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అని చెప్పగానే అందరి చేతులు చప్పట్లతో మార్మోగిపోయింది ఆడిటోరియం. దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుంచి నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అందుకోవడంతో దేశం లోని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. విశ్వవేదికపై మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, సినీ ప్రేమికులు నాటు నాటు సాంగ్ ఆస్కార్ విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
THE OSCAR MOMENT ❤️🔥❤️🔥❤️🔥 #NaatuNaatu #Oscars95 #RRRMovie pic.twitter.com/0P0SLLfnOd
— RRR Movie (@RRRMovie) March 13, 2023
'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023