Naresh and Pavithra Lokesh: కీలకనిర్ణయం తీసుకున్న నరేష్, పవిత్ర లోకేష్ !
Naresh and Pavithra Lokesh Takes Important Decision:నటుడు నరేష్, పవిత్రా లోకేష్ వీరిద్దరు గత కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్రను నరేష్ పెళ్లి చేసుకున్నాడని నరేష్ మూడో భార్య రమ్య ఆరోపించింది. ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .
తన భార్య రమ్య తనతో అసలు కలిసి ఉండదని… నరేష్ మీడియా ముందుకు వచ్చి కౌంటర్ స్టేట్మెంట్లు ఇచ్చాడు. తనకు పవిత్ర మంచి స్నేహితురాలని.. అంతకు మించి తమ మధ్య ఏం లేదని చెప్పాడు. పవిత్ర కూడా కొన్ని కామెంట్స్ చేసింది. రమ్య అనవసరంగా తనను టార్గెట్ చేసిందని, తానేం తప్పు చేయలేదని, తనకేం తెలియదని పవిత్ర ఒక వీడియో ద్వారా చెప్పింది. ఇలా ఎప్పుడూ న్యూస్లో నిలుస్తున్నారు వీరు . అయితే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం గానీ ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీడియాకి దూరంగా ఉండాలని సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు కోరడంతో.. నరేష్, పవిత్ర కూడా ఇకపై మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని నిర్ణయించినట్లు టాక్ నడుస్తోంది.ఏదైనా ఉంటె న్యాయ పరంగా వెళ్తా అని నరేష్ అన్నట్లు సమాచారం.