Nani: హ్యాండ్సమ్ లుక్ లో నాని
Nani: విలక్షణమైన నటన ప్రదర్శించడంలో నాని ఎప్పుడు ముందుంటాడు.హీరోగా తనసినిమాలు చేస్తూమరోవైపు తన నిర్మాణంలో ఇతర హీరోలనుకూడా ప్రోత్సహిస్తాడు. నాని ప్రస్తుతం దసరా మూవీలో నటిస్తున్నాడు. ఇందులో నాని ఎప్పుడు చేయని ఎవరుచుడని మేకోవర్ లో కనిపిస్తాడు. ఈ సినిమాకోసం నాని అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మొన్నటివరకు గుబురు గడ్డంతో కనిపించిన నేచురల్ స్టార్ నాని..ఇప్పుడు మీసాల్లేకుండా లవర్ బాయ్ గా హ్యాండ్సమ్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్యనికి గురిచేశాడు.
ప్రస్తుతం నాని ‘దసరా’ మూవీ తో మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తుంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది.
ఈ దసరా చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ ఇస్తుండగా , సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ చిత్ర షూటింగ్ కోసం నాని భారీగా గడ్డం పెంచేసి కనిపించాడు. ఇక ఇప్పుడు షూటింగ్ పూర్తి కావడం తో గడ్డం తీసేసి లవర్ బాయ్ లుక్ లోకి మారిపోయాడు.
నాని తన ట్విట్టర్ అకౌంట్‌లో.. ‘ఎపిక్ మూవీ దసరా షూటింగ్ పూర్తయింది. డైమండ్ లాంటి సినిమా ఎప్పుడూ ప్రకాశిస్తుంది’ అని పోస్టు చేస్తూ చిన్న వీడియో గ్లింప్స్ షేర్ చేశాడు. ఆ వెంటనే మరో పోస్టులో ‘దసరా’ లుక్ మార్చేశాడు. మీసాల్లేకుండా లవర్ బాయ్ లుక్‌లో మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేస్తూ ‘New Day.. New Me’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ లుక్ తన తదుపరి ప్రాజెక్ట్ NANI31 కోసమని తెలుస్తోంది.
New day. New me 🙂#DasaraWrap pic.twitter.com/N5RnaTzoxV
— Nani (@NameisNani) January 12, 2023
An Epic called #DASARA is done 🔥
It’s a wrap
This diamond will shine FOREVER ♥️ pic.twitter.com/2vfAoiSLiE— Nani (@NameisNani) January 12, 2023