Nani Dasara: నాని ‘దసరా’ నుండి క్రేజీ అప్డేట్
Nani Dasara: సినిమా సినిమాకు నాని తన నటన విశ్వ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. గతేడాది ‘అంటే సుందరానికి’ సినిమా తో మంచి సక్సస్ ను అందుకున్నాడు. ఇక నిర్మాతగా ‘హిట్ 2’ తో నాని మరో సక్సస్ ను అందుకున్నాడు. తాజాగా నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. శ్రీకాంత్ ఓదెల ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆమధ్య ఫస్ట్ లుక్ పోస్టర్స్, దోస్తాన్ సాంగ్ విడుదల చేసారు.ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
‘దసరా’ మూవీ టీజర్‌ను జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఈ టీజర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. పూర్తి తెలంగాణ యాసలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సింగరేణి భూములపై జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసారు.