Namrata Shirodkar: వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నమ్రత
Namrata Shirodkar: సినిమా వాళ్లకు నిత్యం సినిమాలే కాదు వీలు కుదిరినప్పుడల్లా రిలాక్స్ కోసం వేరే దేశాలకు వెకేషన్స్ కు వెళుతుంటారు. లేదంటే దైవ దర్శనాలు లాంటివి చేసుకుంటారు. ముఖ్యంగా పలువురు హీరోలు ఇంకొంచం ముందుకెళ్లి దేవుని మాలలు ధరిస్తారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ వైఫ్ నమ్రత నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలో సందడి చేసారు. వట్టెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. పద్మావతి, అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నమ్రతకు ఆలయ అర్చకులు సాదర స్వాగతం పలికారు.
చిన్న తిరుపతిగా పేరు పొందిన వట్టెం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నమ్రతా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ ఆలయాన్ని చూస్తే తిరుపతి వెళ్లిన అనుభూతి కలుగుతుందని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని అన్నారు. గుట్టపై ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామి వారు
కొలువు తీరారని అన్నారు. అప్పుడప్పుడు ఇక్కడకు తప్పక వస్తానని ఆమె పేర్కొన్నారు. నమ్రత తమ గ్రామానికి వచ్చిందనే విషయం తెలిసి పెద్ద ఎత్తున మహేష్ అభిమానులు , ప్రజలు అక్కడికి చేరుకున్నారు.