Phalana Abbayi Phalana Ammayi: నెమ్మదిగా సాగే కథనం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’
Phalana Abbayi Phalana Ammayi: నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. వీరి కాంబినేషన్‌లో ‘కళ్యాణ వైభోగమే’ చిత్రం మంచి హిట్ కొట్టింది. అలాగే ప్రముఖ దర్శకుడు అవసరాలశ్రీనివాస్, నాగశౌర్య కాంబినేషన్‌లో ఊహలు గుసగులాడే, జ్యో అచ్యుతానంద విజయం సొంతం చేసుకున్నాయి. తాజాగా మరోసారి వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రం ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో చూద్దాం.
సంజయ్ (నాగశౌర్య) అనుపమ (మాళవిక నాయర్) కాలేజ్ రోజుల నుంచి ప్రేమించుకుంటూ ఉంటారు. ఉన్నత చదువుల కోసం ఫారిన్ వెళతారు. అక్కడ కూడా వారి మధ్య ప్రేమ కొనసాగుతూ ఉంటుంది. అది ప్రేమ అని తెలియడానికి వాళ్లకి చాలా టైం పడుతుంది. అనుపమకి ఒక సర్జరీ జరుగుతుంది. ఆ సమయంలో సంజయ్ కి ఫోన్ చేసిన రెస్పాండ్ అవ్వడు.. ఆ సంఘటన ఆ ఇద్దరి మధ్య దూరం పెంచుతూ వెళుతుంది. అదే సమయంలో సంజయ్ కి పూజ (మేఘ చౌదరి) పరిచయమవుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ జీవితాలు ఎలా టర్న్ తీసుకుంటాయి. వీరు మళ్ళీ కలుస్తారా లేదా అనేది తెరపై చూడాల్సిందే.
అవసరాల శ్రీనివాస్ ఎంచుకునే కథలు ఆయన టేకింగ్ చాలా నీట్ గా ఉంటాయి. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఆయన సినిమాలు ఉంటాయి. అదే పద్ధతిలో ఈ కథ కూడా నడుస్తుంది. పాత్రల్ని ఎంతో సహజంగా చూపించాలనే ఆలోచనతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య లాంగ్ జర్నీని దర్శకుడు శ్రీనివాస్ అవసరాల బాగా ఎలివేట్ చేశాడు. సంజయ్ పాత్రలో నాగసౌర్య తన మార్కు నటనను కనబరిచాడు. ఇక మాళవిక నాయర్ అద్భుతమైన హావభావాలను పలికించింది. అతిథి పాత్రలో అవసరాల శ్రీనివాస్ నటన బాగుంది. ఇక కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో పార్టు పార్టులుగా మెప్పించినా కానీ చాలా నెమ్మదిగా సాగే కథనం, ఎప్పుడు ఏ ఇయర్ లో ఉన్నామా అన్న కన్ఫ్యూజర్ ల నడుమ ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. చివరగా చెప్పాలంటే నెమ్మదిగా సాగేకథనముతో సాగేసినిమాను ఓపికగాచూడాలి.