NagaShourya to tie Knot on November 20: టాలీవుడ్ హీరో నాగ శౌర్య పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాది తన సోదరుడు వివాహం అమెరికాలో జరగా ఇప్పుడు నాగశౌర్య వివాహం కూడా జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈనెల 20వ తేదీన బెంగళూరులో నాగశౌర్య వివాహం జరగబోతుందని టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. అనూష అనే యువతిని నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది. అంతేకాక ఈనెల 19వ తేదీన మెహందీ ఫంక్షన్ కూడా ఉందని ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి అని తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. నాగశౌర్య సినిమాల విషయానికి వస్తే ఇటీవల నాగశౌర్య తన కెరీర్ లో 24వ సినిమాను ప్రారంభించారు. అరుణాచలం డైరెక్షన్ చేస్తున్న సినిమాకు ప్రస్తుతానికి ఎన్ఎస్ 24 అని సంభోదిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని వైష్ణవి ఫిలిమ్స్ మీద శ్రీనివాసరావు, విజయ్ కుమార్, అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాతో అయినా ఎలా అయినా హిట్ కొట్టాలని నాగశౌర్య ఎదురు చూస్తున్నాడు. అయితే శౌర్య వివాహం జరగబోతున్న సంగతి బయటికి వచ్చింది కానీ అది ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిరించిన వివాహమా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.