Vikrnat Rona : సుదీప్ సినిమాకి నాగార్జున ప్రమోషన్
Sudeep Vikrnat Rona: కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన భారీ బడ్జెట్ మూవీ ‘విక్రాంత్ రోణ’.ఈరోజు న ఈ త్రీడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. కిచ్చా సుదీప్ నటించిన ఈ చిత్రాన్ని అనూప్ భండారి డైరెక్ట్ చేశారు. ఇంకా ఈ చిత్రంలో జాక్వలైన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. సల్మాన్ ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై నార్త్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు. ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో..ముఖ్య అతిధిగా నాగార్జున హాజరయ్యారు.
నాగార్జున మాట్లాడుతూ : సుదీప్ కన్నడ కాదు తెలుగువాడే. తను హైదరాబాద్‌లోనే ఉంటాడు. సుదీప్ ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించేశాడు. ఇప్పుడు ‘విక్రాంత్ రోణ’ అనే ఒకే చిత్రంతో అన్ని భాషల ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ట్రైలర్ అదిరిపోయింది సినిమాను త్రీడీలో తీశారని అంటున్నారు. కచ్చితంగా ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్నారు.
సుదీప్ మాట్లాడుతూ :నేను టీవీ లో చూసిన తొలి చిత్రం ‘రాముడు భీముడు’.థియేటర్లో చూసిన తొలి చిత్రం ‘శివ’. నాకు భాష రాకపోయినా రెండు రోజుల్లోనే మూడు షోస్ చూశాను. సైకిల్ చైన్‌తో మరొకరిని కొట్టవచ్చునని అప్పటి వరకు నాకు తెలియలేదు. అది అప్పుడు స్టయిల్‌గా మారింది. నేను చేసిన ఒక ఫోన్ తో నాగార్జునగారు ఈరోజు ఇక్కడకు రావటం ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. 65-70 శాతం సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే చిత్రీకరించాం. ఎక్కువ భాగం అన్నపూర్ణ స్టూడియోలోనే చిత్రీకరించాం. జూలై 28న సినిమా త్రీడీ, 2డీ టెక్నాలజీలో సినిమా రిలీజ్ అవుతుంది” అన్నారు.
దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ:’విక్రాంత్ రోణ’ అనేది నా 20 ఏళ్ల కల. సుదీప్గారితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నా ఫస్ట్ స్క్రిప్ట్ సుదీప్ కోసమే రాశాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేశాను. నాకు గర్వంగా ఉంది. అక్కినేని ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. గీతాంజలి సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అన్నారు.