Big Boss: బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్
Bigg Boss Telugu season 6: బుల్లితెర మీద ప్రసారమైన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కి మంచి రేటింగ్ పొందింది. మరియు అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో 5 సీజన్ లను పూర్తి చేసుకుంది. అలాగే ఓటిటిలో నాన్ స్టాప్ సీజన్ ఒకటి పూర్తి చేసుకుంది. నాన్ స్టాప్ సీజన్ లో బిందు మాధవి టైటిల్ దక్కించుకుంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ పూర్తైన సమయం నుండి ప్రేక్షకులు బిగ్ బాస్ 6 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్దీ కాలంగా బిగ్ బాస్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కొనసాగుతూనే ఉంది.టి వి లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్లతో పోలిస్తే ఓటీటి లో ప్రసారమైన నాన్ స్టాప్ సీజన్ కి ఆదరణ తక్కువైంది.ఇప్పుడు మళ్ళీ టెలివిజన్ లోనే టెలికాస్ట్ కాబోతుంది.
బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నప్రేక్షకులు ఆనందించేలా బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం కాబోయే తేదిని ఫిక్స్ చేశారు టీమ్ మెంబర్స్. సెప్టెంబర్ 4వ తేదీ బిగ్ బాస్ సీజన్ 6 మొదటి ఎపిసోడ్ ప్రారంభం కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇదే తేదీని ఫిక్స్ చేయాలనీ యూనిట్ సభ్యులు కూడా ఆలోచిస్తున్నారంట.