Tollywood : చిరంజీవితో నాగార్జున పోటీ తప్పేలా లేదు
Chiranjeevi Fight With Nagarjuna At Box-Office: చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘గాడ్ ఫాదర్’ . ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా అభిమానుల ముందుకు దసరా కానుకగా రాబోతుంది. ఇది మలయాళ సినిమా ‘లూసిఫర్’ కు రీమేక్ గా తీస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిం సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
ఈ గాడ్ ఫాధర్ సినిమాను విజయదశమి సందర్భంగా విడుదల చేయనట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించారు. అయితే అదే సీజన్లో నాగార్జున సినిమా రానున్నట్లు అనౌన్స్ చేశారు.కింగ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది ‘ఘోస్ట్’ ఈ సినిమాను ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమా హై యాక్షన్ థ్రిల్లర్ గా అభిమానుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తున్నారు.ఇప్పడు నాగ్ చిరంజీవి మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇది వరకు వీరు ఒకే తేదీకి సినిమాలు రిలీజ్ కాలేదు కానీ.. ఒకే సీజన్ లో నాలుగైదు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు కొన్ని సినిమాలు వచ్చాయి.నాగ్ డెబ్యూ మూవీ విక్రమ్- వేట సినిమాలు 5 రోజుల వ్యవధిలో రిలీజు అయ్యాయి. తర్వాత దొంగ మొగుడు – మజ్ను సినిమాలు కూడా అదేవిధంగా రిలీజు అయ్యాయి. రుద్రవీణ – ఆఖరి పోరాటం ఇలా ఒకే టైంలో పోటీ పడ్డాయి ఇప్పుడు ఇన్నేళ్లకి మళ్ళీ మెగాస్టార్ తో నాగ్ పోటీ తప్పేలాలేదు. విజయదశమికి ఇంకా మూడు నెలలు సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో సినిమా రిలీజ్ డేట్ మార్పులు జరుగుతాయేమో చూడాలి.