Nagababu: తమ్మారెడ్డి భరద్వాజ్ కు నాగబాబు ఘాటు కౌంటర్
Nagababu: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేసిందని, ఆ డబ్బుతో మేము 10 సినిమాలు తీసి మొఖాన కొడతాం అంటూ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇక మొట్టమొదటి తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఒక సాంగ్ ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తో పాటు మిగతా టీమ్ కూడా లాస్ ఏంజెల్స్‌లో అడుగు పెట్టారు. అక్కడ వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడపుతున్న సమయంలోనే ఆర్ఆర్ఆర్ సినిమా పై తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తమ్మారెడ్డి వ్యాఖ్యల పై మెగా బ్రదర్ నాగబాబు ఘాటుగా స్పందించారు. ‘’నీ అమ్మా మొగుడు ఖర్చుపెట్టడారా 80కోట్లు ట్రిపులార్‌కి, ఆస్కార్‌కోసం అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు నాగబాబు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. టు హోమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ అంటూ నాగబాబు అదే ట్వీట్లో కామెంట్ చేశారు. ఈ బూతు పంచాంగం వైసీపీ పరిభాషలో అంటూ పొలిటికల్ రంగు కూడా పులిమే ప్రయత్నం చేశారు నాగబాబు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో నాగబాబు ట్వీట్ వైరల్ అవుతోంది.