Naga Chaitanya:నాగచైతన్య -వెంకటప్రభు కొత్త చిత్రం అప్ డేట్!
Naga Chaitanya Venkat Prabu Film Update: లవ్ స్టోరి,బంగార్రాజు చిత్రాలతో సక్సెస్ కొట్టిన నాగ చైతన్య ‘థాంక్యూ’ చిత్రం తో హ్యాట్రిక్ కి ట్రై చేస్తున్నాడు.మనం సినిమాతో సక్సెస్ కొట్టిన విక్రమ్ ఈ థాంక్యూ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ,సాంగ్స్ కి మంచిరెస్పాన్సు వస్తుంది. మనం తర్వాత చై,విక్రమ్ కాంబినేషన్ లో వస్తున్నా ఈ చిత్రం పై అంచనాలు బాగానే పెట్టుకున్నారు అభిమానులు. ఇదిలాఉంటే చైతన్య మరో సినిమాకి లైన్ క్లియర్ చేసాడు.
నాగచైతన్య నటించబోయే కొత్త సినిమా అప్‌డేట్స్ వచ్చేసింది. వెంకట ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య తన 22 వ సినిమా చేయనున్నాడు. శ్రీనివాస్ సిల్వర్ స్కీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నాడు… ఈ చిత్ర వివరాలు జూన్ 23న అధికారికంగా ప్రకటించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నాకా వీరిద్దరూ కెరియర్‌పై దృష్టి పెట్టారు. అయితే నాగ చైతన్య, సమంతలపై ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ టైం లో నాగచైతన్య వార్తలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు
With all ur love and blessings!!! #NC22 https://t.co/XgAnpsat5w
— venkat prabhu (@vp_offl) June 22, 2022