Oscar 2023: డాల్భీ థియేటర్లో దుమ్మురేపిన నాటు నాటు పెర్ఫామెన్స్
Oscar 2023: ఆస్కార్ అవార్డుల వేడుకలు మొదలయ్యాయి. 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సం షురూ అయ్యాయి. తొలిసారి ఆస్కార్ వేడుకలో తెలుగు సినిమా పార్ట్ కావటం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఆస్కార్ వేడుకల్లో చాలాచిత్రాలు ఇప్పటికే అవార్డును అందుకున్నాయి. మన నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలుస్తుందా లేదా అనే ఉత్కంఠ అందరిలో ఉంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ఇండియా నుంచి డాక్యుమెంటరీ ఫిలిం ఆల్ దట్ బ్రీత్స్, డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పర్స్ కూడా నామినేషన్స్ లో నిలిచాయి.
ఇందులో బెస్ట్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఇండియాకు ఆస్కార్ లభించింది. ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయానికి వస్తే..నాటు నాటు సాంగ్ గురించి చెప్పగానే ఆడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. నాటు నాటు సాంగ్ లైఫ్ పెర్ఫామెన్స్ కి దీపికా పదుకొనె.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లని ఆహ్వానించింది. రాహుల్, కాలభైరవ హుషారెత్తించేలా నాటు నాటు సాంగ్ ని పడుతూ ఆస్కార్ వేదికపై దుమ్ము దులిపారు. ఈ వేడుకపై బ్లాక్ ట్రెడిషనల్ వేర్లో.. లాల్చీ, పంచకట్టులో కనిపించారు సింగర్స్. ఇక వీరు పాట పాడుతుంటే వేదికముందు ఉన్న అతిధులు ఒక్కసారిగా నాటు నాటు పాటకు విజిల్స్ వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ స్థానంలో అమెరికన్ డాన్సర్ అయిన లారెన్ గోట్లిబ్ ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు సాంగ్‌ను పెర్ఫామ్ చేశారు.
Here's the energetic performance of "Naatu Naatu" from #RRR at the #Oscars. https://t.co/ndiKiHeOT5 pic.twitter.com/Lf2nP826c4
— Variety (@Variety) March 13, 2023